: కమలహాసన్ వాస్తవం మాట్లాడారు!: మద్దతు పలికిన విజయ్‌కాంత్
తమిళనాడు ప్రభుత్వ పనితీరును సోషల్ మీడియా వేదికగా విలక్షణ నటుడు కమలహాసన్ ఎండగడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అవినీతి గురించి ఆయన వ్యక్తీకరిస్తున్న భావాలకు అభిమానులు, ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. ఇటీవల అవినీతి గురించిన ఫిర్యాదులను సరాసరి సంబంధిత మంత్రులకు ఈ-మెయిల్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై తమిళనాడు మంత్రి వర్గం విమర్శల వర్షం కురిపించింది. ఈ విమర్శల నేపథ్యంలో కమల్‌కు మద్దతునిస్తూ నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ ముందుకొచ్చారు. రాజకీయాల్లో కాస్త అనుభవం ఉన్న విజయ్కాంత్ చెబుతూ, `ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయాల గురించి కమల్ నిజం మాట్లాడారు` అంటూ ప్రశంసించారు. త్వరలోనే రజనీకాంత్ కూడా కమల్‌కు మద్దతుగా మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.