: నితిన్ హీరోగా పవన్ కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రం.. ప్రారంభమైన షూటింగ్!


నితిన్ హీరోగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చెందిన క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ నేడు ప్రారంభమైంది. నితిన్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ తో కలసి క్రియేటివ్ వర్క్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. స్క్రీన్ ప్లే, డైలాగులను అందించడమే కాకుండా డైరెక్షన్ కూడా కృష్ణ చైతన్య చేస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తొలి ఐదు రోజుల పాటు హైదరాబాదులో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా... ఆ తర్వాత భారీ షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లనుంది. ఈ సినిమాలో నితిన్ తో పాటు మేఘా ఆకాశ్, రావు రమేష్, నరేష్, ప్రగతి, లిజీ, నర్రా శ్రీను, శ్రీనివాసరెడ్డి, మధు తదితరులు నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News