: కేటీఆర్ కు గవర్నర్ జన్మదిన కానుక!
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మంత్రి కేటీఆర్ కు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ గ్రీటింగ్ కార్డును, ఒక పూల మొక్కను రాజ్ భవన్ నుంచి ఆయనకు పంపారు. ‘ఈ రోజు మీకు ఎంతో ముఖ్యమైనది, ఈ సందర్భంగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ‘ఆరోగ్యం, సుఖ సంతోషాలతో పాటు విజయం చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని నరసింహన్ తన గ్రీటింగ్ కార్డులో ఆకాంక్షించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఆ గ్రీటింగ్ కార్డును, పూల మొక్క ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.