: చార్మి కేసు: చంద్రవదన్, అకున్ సబర్వాల్‌కు హైకోర్టు నోటీసులు జారీ.. రేపు విచారణ!
డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న హీరోయిన్ ఛార్మి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సిట్ అధికారుల విచారణ తీరు సరిగా లేదని, విచారణలో భాగంగా రక్త నమూనాల సేకరణ సరికాదని హైకోర్టులో దాఖలు చేసిన రిట్ లో చార్మి ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రవదన్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, హైకోర్టులో చార్మి దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనున్నట్టు సమాచారం.