: డ్వేన్ జాన్సన్ సరసన ఆపిల్ `సిరి`?
ఆపిల్ కంపెనీ ఫోన్లు ఉపయోగించే వారికి `సిరి` గురించి పరిచయం అక్కర్లేదు. వారి రోజువారీ కార్యక్రమాల్లో సిరి భాగమైపోతుంది. అదే సిరి ఇప్పుడు హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్‌తో కలిసి ఓ సినిమాలో నటించింది. కేవలం గొంతు మాత్రమే వినిపించి, రూపం లేని ఆపిల్ సిరితో కలిసి ఓ కామెడీ అడ్వెంచరస్ సినిమాలో నటించినట్లు డ్వేన్ స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా పేరు `ద రాక్ వర్సెస్ సిరి: డామినేట్ ద డే`గా ఆయన తెలిపారు. మూడు నిమిషాల 45 సెకన్లు ఉన్న ఈ చిత్ర వీడియో యూట్యూబ్‌లో చూడొచ్చు.