: మరో రెండు గజరాజుల్ని కాపాడిన నేవీ అధికారులు... వీడియో చూడండి
శ్రీలంకలోని కొలంబోలో ట్రింకోమాలి తీరంలో సముద్రం అలల ధాటికి కొట్టుకుపోతున్న రెండు ఏనుగులను శ్రీలంక నేవీ అధికారులు కాపాడారు. ఇటీవల కాలంలో ఇలా ఏనుగులను నేవీ అధికారులు కాపాడటం ఇది రెండోసారి. గజ ఈతగాళ్లు, పెద్ద పెద్ద తాళ్లు, లంగర్ల సహాయంతో గంటల పాటు కష్టపడి ఏనుగులను కాపాడినట్లు నేవీ అధికారులు చెప్పారు. తర్వాత వీటిని పక్కనే ఉన్న ఫౌల్ పాయింట్ అరణ్యంలో విడిచిపెట్టినట్లు వారు తెలిపారు. నీళ్లలో తొండాలు మాత్రమే పైకి కనబడుతూ, ఈదలేక కష్టపడుతున్న వాటిని శ్రీలంక నేవీ సముద్ర పెట్రోలింగ్ అధికారులు గుర్తించారు. రెండు వారాల క్రితం కూడా తీరానికి 8 కి.మీ.ల దూరంలో కొట్టుకుపోతున్న గజరాజును నేవీ అధికారులు కాపాడిన విషయం తెలిసిందే!