: చార్మి, ముమైత్ ఖాన్ ల విచారణ.. మహిళా అధికారుల కోసం అన్వేషిస్తున్న సిట్
డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖుల విచారణ జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురి విచారణ ముగిసింది. 26వ తేదీన ఛార్మి, 27వ తేదీన ముమైత్ ఖాన్ సిట్ ముందు విచారణకు హాజరవనున్నారు. వారిద్దరి వద్ద నుంచి కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న సిట్ అధికారులు... వీరిని విచారించేందుకు నైపుణ్యమున్న అధికారుల కోసం గాలిస్తున్నారు. మహిళా అధికారులతో విచారిస్తే, కీలక సమాచారం రాబట్టవచ్చని సిట్ భావిస్తోంది. ఎక్సైజ్ శాఖలో అంతటి అధికారులు లేకపోతే, పోలీస్ శాఖలో ఉన్న మహిళా అధికారులతో విచారణ జరిపించాలని నిర్ణయించారు. ఇప్పటికే 10 మంది మహిళా అధికారులతో కూడిన జాబితా సిద్ధమయిందని... వీరిలో ఇద్దరిని ఛార్మిని విచారించేందుకు, మరో ఇద్దరిని ముమైత్ ను విచారించేందుకు ఎంపిక చేస్తారని తెలుస్తోంది.