: నటి సుచిత్రా కృష్ణమూర్తిపై ఎస్పీ నేత విమర్శలు


సినీ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తిపై సమాజ్ వాదీ పార్టీకి చెందిన జుహీ సింగ్ విమర్శలు కురిపించారు. దేవుడి ప్రార్థనకంటే... ఆమెకు నిద్రపోవడమే ముఖ్యమేమోనని విమర్శించారు. ఇలాంటి వారంతా ఏం మనుషులో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

ఆజాన్ వల్ల ఉదయాన్నే తనకు నిద్రాభంగం అయిందని... దేవుడుని ప్రార్థించాలంటూ ఇతరులకు ఇబ్బంది కలిగేలా, మైకుల ద్వారా గట్టిగా చెప్పడం ఏమిటని సుచిత్ర నిన్న ట్విట్టర్ ద్వారా ప్రశ్నించింది. దేవుడిని గుర్తు చేసుకునేందుకు ప్రత్యేక లౌడ్ స్పీకర్లు అవసరం లేదని ఆమె అన్నారు. తాను బ్రహ్మ ముహూర్తంలోనే లేస్తానని, పూజలు, యోగా చేస్తుంటానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై జుహీ సింగ్ విమర్శలు కురిపించారు.

  • Loading...

More Telugu News