: రెండేళ్ల బాలుణ్ని హతమార్చిన చిరుత
ముంబైలోని గోరెగావ్ ఫిల్మ్ సిటీ ప్రాంతంలో రెండేళ్ల బాలుణ్ని చిరుతపులి హతమార్చింది. ఫిల్మ్ సిటీలోని హెలీప్యాడ్ ప్రాంతంలో ఆడుకుంటున్న రెండేళ్ల విహాన్ నాయక్‌ను చిరుతపులి ఈడ్చుకెళ్లిన గుర్తులు బాలుడి మెడపైన ఉన్నాయని వైద్యులు తెలియజేశారు. అలాగే బాబు మరణించిన కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతంలో చిరుతను చూసినట్లు స్థానికులు చెప్పారు. ప్రమాదం జరిగిన చాలా సేపటికి గుర్తించడంతో ఆసుపత్రికి తీసుకొచ్చేలోగా బాలుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.