: మహిళల ఐపీఎల్ ప్రారంభించండి.. ఇదే కరెక్ట్ టైమ్: మిథాలీ రాజ్


ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే, ఇప్పటి వరకు మహిళలకు ఐపీఎల్ లో స్థానం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ, మహిళల ఐపీఎల్ ను ప్రారంభించాలని... దానికి ఇదే సరైన సమయమని తెలిపింది. దీని వల్ల మహిళా క్రికెటర్ల ఆట నైపుణ్యాలు పెరగడమే కాకుండా, ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. ఇంగ్లండ్ లో మహిళలకు ఇక్విలెంట్ సూపర్ లీగ్, ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ లు ఉన్నాయని... ఇదే తరహాలో మహిళల ఐపీఎల్ ను ప్రారంభించాలని కోరింది. బిగ్ బాష్ లీగ్ లో ఆడిన స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ లు ప్రపంచకప్ లో బాగా రాణించారని మిథాలీ గుర్తు చేసింది. మహిళా క్రికెటర్ల పట్ల బీసీసీఐ సుముఖంగానే ఉందని తాను భావిస్తున్నట్టు తెలిపింది 

  • Loading...

More Telugu News