: వృద్ధుడిగా మారిన రణ్‌వీర్ సింగ్?... వీడియో చూడండి
బాలీవుడ్‌లో ఎల్లప్పుడూ ఆరు పలకల సౌష్టవంతో కనిపించే హీరో రణ్‌వీర్ సింగ్, మొదటిసారి బానెడు పొట్ట వేసుకుని వృద్ధుడిగా కనిపించాడు. తాను వృద్ధుడి అవతారంలో మెట్లు దిగుతూ తీసిన వీడియోను రణ్‌వీర్ తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇది ఏదైనా వ్యాపార ప్రకటన కోసమా? లేక తర్వాతి సినిమా కోసమా? అనే విషయం మాత్రం రణ్‌వీర్ చెప్పలేదు. ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకునేతో `పద్మావతి` సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లాఉద్దీన్ ఖిల్జీ యుక్త వయస్సు పాత్రను పోషించడానికి ఇటీవల తన మీసం, గడ్డం తీసేసిన ఫొటోను కూడా రణ్‌వీర్ షేర్ చేసిన సంగతి తెలిసిందే!