: ఛార్మీకి అంత తొందర ఎందుకు? అసలేం జరుగుతోంది?


ప్రముఖ సినీ నటి ఛార్మి తొందరపడిందా? అంటే సినీ పరిశ్రమకు చెందిన వారు అవుననే సమాధానం చెబుతున్నారు. టాలీవుడ్ లో డ్రగ్స్ అంశంపై పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్ లను విచారించిన సిట్ అధికారులు నవదీప్ ను విచారిస్తుండగా, విచారణకు హాజరుకాని ఛార్మీ హైకోర్టునాశ్రయించడంపై సినీ పరిశ్రమలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ ను నిర్మూలించాల్సిందేనని, అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రెస్ మీట్ పెట్టిమరీ ప్రకటించింది. ఈ క్రమంలో పరిశ్రమలో భాగమైన నిందితులంతా సిట్ అధికారుల ముందు హాజరై తమ వాదన వినిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఛార్మీ హైకోర్టులో పలు షరతులతో తనను విచారించాలని కోరింది. దీంతో ఛార్మీ డ్రగ్స్ సేవించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ డ్రగ్స్ తీసుకుందని నిరూపణ అయితే ఆమెకు అవకాశాలు తగ్గడంతో పాటు ఆమె పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుందని ఛార్మీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె హైకోర్టును ఆశ్రయించింది. కాగా, ఛార్మీ కౌర్ తరపున పిటిషన్ ను లాయర్ విష్ణువర్థన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News