: నవదీప్ సిట్ కార్యాలయానికి ఎక్కడి నుంచి వచ్చాడో తెలిసింది!


టాలీవుడ్ యువ నటుడు నవదీప్ సిట్ విచారణకు 10:20 నిమిషాలకు హాజరైన సంగతి తెలిసిందే. నేడు నవదీప్ విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్దకు మీడియా నేటి ఉదయమే చేరుకుంది. అయితే, ఇంట్లో నవదీప్ లేడన్న సమాచారంతో వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయానికి నవదీప్ నేరుగా సిట్ కార్యాలయంకు వచ్చేశాడు. దీంతో నవదీప్ ఎక్కడి నుంచి వచ్చాడన్న వివరాలను మీడియా ప్రతినిధులు సేకరించారు. తన ఇంటికి మీడియా వస్తుందని ముందే ఊహించిన నవదీప్ రాత్రే కుటుంబ సభ్యులను తీసుకుని పార్క్ హయాత్ హోటల్ కు మకాం మార్చినట్టు తెలిసింది. అక్కడి నుంచే నేరుగా సిట్ కార్యాలయానికి చేరాడు. విచారణ అనంతరం కూడా అక్కడికే వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News