: నారా లోకేష్ ట్వీట్ కు కేటీఆర్ రీట్వీట్!
తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ శుభాకాంక్షలపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'చాలా థ్యాంక్స్ లోకేష్ గారు. మీ శుభాకాంక్షలు సంతోషాన్ని కలిగించాయి. ఏపీ, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం కలసికట్టుగా పని చేద్దాం' అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.
అలాగే తనకు శుభాకాంక్షలు తెలిపిన హీరో మంచు విష్ణు, హీరోయిన్ సమంతలకు కూడా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 'మన హ్యాండ్ లూమ్ అంబాసడర్ సమంతకు ధన్యవాదాలు. మీ చిత్తశుద్ధి మాలో నూతనోత్తేజాన్ని నింపుతోంది. 'ఊవెన్ 2017' కోసం ఎదురు చూస్తున్నా' అంటూ సమంత్ ట్వీట్ కు రీట్వీట్ చేశారు.