: కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడి పబ్ లో డ్రగ్ దందా: జీవన్ రెడ్డి
మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి చెందిన పబ్ లో డ్రగ్స్ వ్యాపారం జరిగిందని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని అన్నారు. చట్టానికి సినీ ప్రముఖులు అతీతులు కారని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ విచారణ రహస్యంగా చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారని ఆరోపించడం సరికాదని ఆయన సూచించారు. డ్రగ్స్ ను అంతమొందించాల్సిన అవసరం ఉందని, ఈ వ్యవహారంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టకూడదని ఆయన స్పష్టం చేశారు.