: వేగంగా సిట్ కార్యాలయానికి చేరుకుని... మీడియాకు నమస్కారం పెట్టి విచారణకు వెళ్లిన నవదీప్


టాలీవుడ్ నటుడు నవదీప్ సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు. నిన్న రాత్రే నివాసం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిపోయిన నవదీప్... ఈ ఉదయం నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు. మీడియా అప్రమత్తమయ్యేలోపు వేగంగా సిట్ కార్యాలయంలో ప్రవేశించాడు. అక్కడే వేచి చూస్తున్న మీడియా ప్రతినిధులకు ఒక నమస్కారం పెట్టిన నవదీప్ నేరుగా విచారణ కోసం సిట్ కార్యాలయంలోకి వెళ్లిపోయాడు.

నవదీప్ విచారణకు 10:30 నిమిషాలకు హాజరుకావాల్సి ఉండగా, 10:20 నిమిషాలకు సిట్ కార్యాలయానికి వచ్చాడు. హైదరాబాదులోని గచ్చిబౌలిలో గతేడాది బీపీఎం పబ్ ను నవదీప్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా హైదరాబాదులోని ప్రముఖులందరికీ ఉచితంగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను స్ధాపించిన నవదీప్ తన సమర్థవంతమైన పనితీరుతో బడాబాబుల ఈవెంట్లను నిర్వహిస్తుంటాడని సిట్ అధికారులు గుర్తించారు. కెల్విన్ తో నవదీప్ కు ఉన్న సంబంధాలు, జిషాన్ (జాన్) తో సాన్నిహిత్యం, డ్రగ్స్ సరఫరా, వినియోగం, పార్టీ కల్చర్ వంటి విషయాలపై నవదీప్ ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News