: రహస్య ప్రాంతానికి నైజీరియన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు, విజయవాడ యువతి
హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున డ్రగ్స్ తో పట్టుబడిన నైజీరియన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు, మరో ఇద్దరు నైజీరియన్లు, విజయవాడకు చెందిన యువతి సహా నిందితులను ఓ రహస్య ప్రాంతానికి తరలించి పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వీరి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టిన తరువాత, మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. వీరు అరెస్టయిన ఇంట్లో వ్యభిచారం కూడా జరుగుతోందన్న సమాచారాన్ని చుట్టు పక్కల వారు పోలీసుల దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ విజయవాడ యువతితో వ్యభిచారం చేయించేందుకు నైజీరియన్ల ముఠా తీసుకువచ్చిందా? లేక డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయా? అన్న కోణంలో విచారణ సాగుతోంది.