: బిగ్ బాస్ హౌస్ లో 'ఆ బాధ్యత నీదే' అంటూ సింగర్ కల్పనకు పని అప్పగించిన జూనియర్ ఎన్టీఆర్


బిగ్ బాస్ రియాలిటీ షో వ్యాఖ్యాత జూనియర్ ఎన్టీఆర్ సింగర్ కల్పనకు పెద్ద బాధ్యతను అప్పగించాడు. బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభమైన తరువాత పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల తీరుపై విమర్శలు గుప్పించారు. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లను మేకప్ లేకుండా చూడలేకపోతున్నామని, వెంటనే వారికి మేకప్ కిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వారాంతంలో వ్యాఖ్యానించే జూనియర్ ఎన్టీఆర్ వారి మేకప్ బాధ్యతను సింగర్ కల్పనకు అప్పగించాడు.

సింగర్ కల్పన సింగింగ్ షోలలో సంప్రదాయ వస్త్రధారణలో కాస్త ఎక్కువ మేకప్ లో వస్తారన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ షోలో మాత్రం ఆమె తొలి వారమంతా ఇంచుమించు నైటీలోనే కెమెరాలకు కనిపించారు. దీంతో ఆమె కంఫర్టబుల్ గా ఉండేందుకు అలా ఉన్నప్పటికీ ఆమెను అందంగా తయారవ్వాలని చెబుతూ, ఇతరులను కూడా అందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆమెదేనని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. దీంతో శనివారం మేకప్ లేకుండా షోలో కనిపించిన కల్పన ఆదివారం సింగింగ్ షోలో పాల్గొన్న కల్పనలా కనిపించింది. 

  • Loading...

More Telugu News