: 'సగం' వెనక్కి తగ్గిన మాటీవీ
పరభాషా సీరియళ్ళు ప్రసారం చేసి తమ పొట్టకొట్టొద్దని కొన్ని చానళ్ళ యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తెలుగు బుల్లితెర కళాకారుల ఆకాంక్ష 'సగం' నెరవేరింది. డబ్బింగ్ సీరియళ్ళ ప్రసారం ఆపేదిలేదని మొండి పట్టుదలకుపోయిన మాటీవీ యాజమాన్యం కాస్త వెనక్కితగ్గింది. వచ్చే నెల నుంచి 50 శాతం అనువాద ధారావాహికలను నిలిపివేస్తామని మాటీవీ నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయమై మాటీవీ సహ భాగస్వామి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, డబ్బింగ్ సీరియళ్ళ ప్రసారానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న వారితో చర్చించినట్టు తెలిపారు.
కాగా, తెలుగులో అత్యధిక చానళ్ళు ఇప్పటికే డబ్బింగ్ సీరియళ్ళ ప్రసారం నిలిపివేయగా, మా టీవీ మాత్రం పాతపంథానే కొనసాగిస్తోంది. ఈ విషయమై కిందటి నెలలో టీవీ ఆర్టిస్టులు మాటీవీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన సంగతి తెలిసిందే.