: మీడియా మొత్తం నవదీప్ ఇంటిదగ్గర... ఇంట్లో లేని నవదీప్!
డ్రగ్స్ కేసులో నేడు నవదీప్ ను విచారించనున్న సంగతి తెలిసిందే. దీనిపై నవదీప్ ఎలా స్పందిస్తాడోనన్న ఆసక్తితో మీడియా మొత్తం ఆయన నివాసానికి బయల్దేరింది. మీడియా ప్రతినిధులంతా అతని నివాసం వద్ద ఎదురు చూస్తుండగా, నవదీప్ రాత్రి ఇంటికి రాలేదని అతని అపార్ట్ మెంట్ సెక్యూరిటీ తెలిపాడు. ఈ రోజు మీడియా తన ఇంటికి వస్తుందని తెలిసే, నవదీప్ ఎక్కడికో వెళ్లి ఉంటాడని అనుకుంటున్నారు.