: జియో 4జీ ఫీచర్ ఫోన్లో ఉపయోగించే చిప్ ఏదో తెలిసిపోయింది!
జియోఫోన్.. దేశంలో ఇప్పుడిదో సంచలనం. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో వీటిని వినియోగదారులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పేరుకు ఫీచర్ ఫోనే అయినా ఇందులో ఉన్న ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ఫోన్లు ఏ ప్లాట్‌ఫాంపై పనిచేస్తాయన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. వీటిలో వాడే చిప్ సెట్ విషయం బయటకు రాలేదు. అయితే తాజాగా వీటిని తయారు చేస్తున్న కంపెనీలు ఆ విషయాన్ని చెప్పేశాయి. జియో వీవోఎల్టీఈ ఫీచర్ ఫోన్ (జియోఫోన్)లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 205, స్నాప్‌డ్రాగన్ ఎల్టీఈ ఎస్ఓసీ ప్లాట్‌ఫ్లామ్‌కు చెందిన ఎస్సీ9820 ప్రాసెసర్లను ఉపయోగించినట్టు ఆయా కంపెనీలు ట్విట్టర్ ద్వారా తెలిపాయి.
జియో స్మార్ట్‌ఫోన్ 22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ద్వారా పూర్తి భద్రతతో కూడా డిజిటల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్ అని జియో పేర్కొంది. ఇందులో జియో సినిమా, జియో టీవీ, జియో మ్యూజిక్ వంటి జియో యాప్స్ వంటివి ప్రీలోడెడ్‌గా వస్తాయి.