: కాపులను మోసం చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి: కాంగ్రెస్ నేత వీహెచ్
కాపులను మోసం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్రను చంద్రబాబు అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబుకు కలలో కూడా ముద్రగడనే కనిపిస్తున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయలేదా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాపులు ఏమైనా ఉగ్రవాదులా? లేక దొంగలా? వారి పాదయాత్ర వద్దంటున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు అందరికీ ఉందని అన్నారు. ఏపీ హోం మంత్రి చినరాజప్ప చెడ పుట్టారని వీహెచ్ మండిపడ్డారు.