: పూరీ జగన్నాథ్ కింద వెయ్యి మంది బతుకుతున్నారు!: నటి ‘అల్లరి’ సుభాషిణి


డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎలాంటి కేసులు లేకుండా మహారాజులా తిరిగి రావాలని దేవుడికి దండం పెట్టుకున్నానని క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్న నటి ‘అల్లరి’ సుభాషిణి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఒక ఆర్టిస్ట్ కంటే డైరెక్టర్ గొప్పవాడని అన్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ కింద వంద మంది ఆర్టిస్టులు బతకొచ్చని, తనకు వేషం ఇచ్చినా, ఇవ్వకపోయినా తన లాంటి పది మందికి పూరీ అన్నం పెడతాడని.. ఒక వెయ్యి మంది ఆయన కింద బతుకుతున్నారని సుభాషిణి చెప్పుకొచ్చారు. కాగా, క్యాన్సర్ వ్యాధిన బారిన పడ్డ సుభాషిణి, శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నారు.

  • Loading...

More Telugu News