: నేను సినిమాలు చూడను.. ‘బాహుబలి’ కూడా చూడలేదు: యండమూరి వీరేంద్రనాథ్


తాను సినిమాలు చూడనని,‘బాహుబలి’ కూడా చూడలేదని మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను ‘బాహుబలి’ చూడలేదు..కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘ప్రతిఘటన’ చూడలేదు. నేను సినిమాలు చూసి ఇరవై సంవత్సరాలు అయింది. టీవీలో ఎప్పుడైనా ఒక అరగంటో, పావుగంటో సినిమాలు చూస్తాను.

అంతేతప్పా, సినిమా హాల్ కు వెళ్లి, కారు పార్క్ చేసి... సినిమా చూసేంత ఓపిక లేదు. నాకు డబ్బు లేదు. ఉన్న డబ్బంతా సరస్వతీ విద్యా పీఠానికి డొనేషన్ గా ఇచ్చేశా. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న కూడా అక్కడక్కడ వారాలు చేసుకుని..చదువుకున్నారు.. పేదరికం నుంచి నేను వచ్చాను కాబట్టి, సంపాదించిన మొత్తాన్ని మళ్లీ ఇచ్చివేయాలనే ఉద్దేశంతో సరస్వతీ విద్యా పీఠం ఏర్పాటు చేసి ట్రైబల్ విద్యార్థులకు ఫ్రీగా విద్య నేర్పిస్తున్నాను’ అని యండమూరి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News