: చిన్నచిన్న వాళ్లను, బలం లేని వాళ్లను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు: రేవంత్ రెడ్డి
డ్రగ్స్ వ్యవహారంలో చిన్న చిన్న వాళ్లను, పెద్దగా బలం లేని వాళ్లను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారని టీ-టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సిట్ అధికారుల విచారణకు హాజరైన వారు బయటపెట్టిన పెద్దలను ఎందుకు విచారణకు పిలవడం లేదని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ కేసు విచారణ చేయాల్సిన నార్కోటిక్, డీఆర్ఐ ఏజెన్సీలకు ఈ కేసును ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అప్పగించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.