: టీమిండియా మహిళా జట్టు విజయం సాధించాలంటూ 12 ట్వీట్లు చేసిన మోదీ!


మహిళల ప్రపంచ కప్ లో టీమిండియా విజయం సాధించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ వరుస ట్వీట్లు చేశారు. తొలుత, టీమిండియా విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత, జట్టులోని 11 మంది సభ్యులను ఉద్దేశించి.. ప్రతి ఒక్కరీని ఉత్సాహపరుస్తూ మోదీ ట్వీట్లు చేయడం విశేషం. ఆ ట్వీట్లలో కొన్నింటి గురించి చెప్పాలంటే.. ‘వికెట్ కీపర్ గా సుష్మా వర్మది కీలక పాత్ర. గుర్తుంచుకో, క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని, ‘గుడ్ లక్ టూ దీప్తి శర్మ.. టీమ్ కు ఎంతో విలువైన క్రీడాకారిణి..’ అని, ‘హర్మన్ ప్రీత్ కౌర్ కు అభిమాని కానిది ఎవరు? సెమీ ఫైనల్స్ లో ఆమె అద్భుత ఆట తీరు ఎల్లప్పుడూ గుర్తుంటుంది. ఈ రోజు నీ అత్యుత్తమ ప్రదర్శన చేయండి’ అంటూ జట్టులోని ప్రతి సభ్యురాలి పేరును ప్రస్తావిస్తూ మోదీ ట్వీట్లు చేశారు.

  • Loading...

More Telugu News