: తెలంగాణలో బీజేపీ మరింత శక్తిమంతంగా ఎదగాలి: రామ్ మాధవ్
తెలంగాణలో బీజేపీ మరింత శక్తిమంతంగా ఎదగాలని ఆ పార్టీ జాతీయ నేత రామ్ మాధవ్ అన్నారు. వరంగల్ లో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ కేవలం నాయకుల పార్టీ కాదని, కార్యకర్తల పార్టీ అని అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమే నేతలు, కార్యకర్తలు పని చేయాలని, దేశంలో మోదీకి 70 శాతం మంది ప్రజల ఆదరణ ఉందని ఈ సందర్భంగా చెప్పారు.
ప్రజల జీవితాల్లో మార్పు కోసమే అధికారంలోకి వచ్చామని, అవినీతి నిర్మూలనకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని అన్నారు. అయితే, దేశంలో అవినీతిని నిర్మూలించడం అంత సులభం కాదని, మూలాల నుంచి దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని రామ్ మాధవ్ అన్నారు.