: ‘తమిళనాడుకు కాబోయే సీఎం కమలహాసన్’ అంటూ పోస్టర్లు!
‘తమిళనాడుకు కాబోయే సీఎం కమలహాసన్’ అంటూ మధురైలో పోస్టర్లు వెలిశాయి. అవినీతి మంత్రులు, అధికారులను ఇంటికి పంపే సత్తా, కమలహాసన్ కే ఉందంటూ ఆ పోస్టర్లలో ఆయన అభిమానులు పేర్కొన్నారు. కాగా, దమ్ముంటే రాజకీయాల్లోకి రావాలంటూ కమల్ ను ఉద్దేశించి తమిళనాడు ఆర్థిక మంత్రి డి.జయకుమార్ ఇటీవల వ్యాఖ్యానించడం, కమల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇటీవల ఓ కవితను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ‘ప్రస్తుతం ఎవరూ రాజు కాదు... నాతో పాటు రండి కామ్రేడ్.. అసంబద్ధతను బద్దలు కొట్టే నాయకుడిగా తయారవుతారు’ అని తన కవితలో ఆయన పేర్కొన్నారు.