: రాష్ట్రపతికి వీడ్కోలు కార్యక్రమం.. ప్రణబ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి: సుమిత్రా మహాజన్


రాష్ట్రపతి ప్రణబ్ పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రణబ్ కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుల సంతకాలతో కూడిన పుస్తకాన్ని ప్రణబ్ కు స్పీకర్ అందజేశారు. కాగా, ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, ప్రణబ్ ముఖర్జీ బెంగాల్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఎదుగుతూ వచ్చారని అన్నారు. ప్రణబ్ రాజకీయనాయకుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారని, 1969లో ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టారని, అందరికీ ఎంతో స్ఫూర్తిగా నిలిచారని, ప్రణబ్ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో ఉండాలని సుమిత్రా మహాజన్ ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News