: దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ కుటుంబం: ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు


దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ కుటుంబమని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజారెడ్డి నుంచి వైఎస్ కుటుంబం దళితుల భూములను దోచుకుందని, ఇడుపులపాయలో వేల ఎకరాల దళితుల భూములు దోచుకున్నారని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇడుపులపాయ అభివృద్ధికే వాడుకున్నారని ఆరోపించారు. కుయుక్తులు ఆపకపోతే వైసీపీకి తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా వైసీపీ పాత్ర ఉంటోందని, కులాలను, వర్గాలను రెచ్చగొట్టడమే ఆ పార్టీ పని అని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News