: డ్రగ్స్ కు వ్యతిరేకంగా విశాఖలో భారీ ర్యాలీ చేపడతాం: మంత్రి గంటా
డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈ నెల 25న విశాఖలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ అంశంపై పాఠశాలల యాజమాన్యాలతో ఈరోజు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ నియంత్రణపై టోల్ ఫ్రీ నంబర్, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణపై ఈ నెల 25న కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామని, డ్రగ్స్ కు వ్యతిరేకంగా విశాఖలో భారీ ర్యాలీ చేపడతామని, గంజాయి రవాణ నియంత్రణపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని గంటా పేర్కొన్నారు.