: ఆ అగ్ర నిర్మాత కొడుకులకు నోటీసులు వద్దని సిట్ పై రాజకీయ ఒత్తిడి!


టాలీవుడ్ లో సంచలనాలు కలిగిస్తున్న డ్రగ్స్ కేసులో, దశాబ్దాలుగా చిత్ర నిర్మాణ రంగంలో ఉన్న ఓ అగ్ర నిర్మాత తనయులిద్దరికీ భాగం ఉందని, వారికి నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న వేళ, వారికి నోటీసులు వద్దని అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలోనే వారికీ నోటీసులు జారీ చేసి, ఆగస్టు 2 తరువాత విచారణకు హాజరు కావాలని నోటీసులను సిట్ రెడీ చేయగా, వారి పేర్లు బయటకు వస్తే, పరిశ్రమ మొత్తం అల్లకల్లోలం అవుతుందని ఆందోళన చెందుతున్న సినీ పెద్దలు, తమకున్న పరిచయాలతో బడా రాజకీయ నాయకులతో ఫోన్లు చేయిస్తూ, వారి పేర్లు కలపవద్దని, నోటీసులు పంపవద్దని చెప్పిస్తున్నట్టు సమాచారం. రాజకీయ ఒత్తిడి లేకుంటే వారికి నోటీసులు తప్పకుండా ఇస్తామని, ఇక ఒత్తిడి పెరిగితే మాత్రం పై అధికారులు చెప్పినట్టు వినాల్సి వస్తుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సిట్ అధికారి ఒకరు వెల్లడించడం గమనార్హం. మొత్తానికి వచ్చే వారం ఈ కేసులో మరిన్ని సంచలనాలు తెరపైకి రావచ్చని అంచనా.

  • Loading...

More Telugu News