: రామ్ గోపాల్ వర్మకు సిట్ నోటీసులు?
టాలీవుడ్ మాదకద్రవ్యాల తొలి రోజు విచారణలో భాగంగా పూరీ జగన్నాథ్ నుంచి, మూడో రోజు విచారణలో భాగంగా సుబ్బరాజు నోటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు రావడంతో సిట్ అధికారులు ఆయనకు నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో విచారణకు వచ్చి సహకరించాలని కోరుతూ వర్మకు నోటీసులు పంపినట్టు సిట్ వర్గాలు వెల్లడించాయి. సుబ్బరాజును విచారిస్తున్న వేళ, సిట్ అధికారులు పలుమార్లు వర్మ పేరును అధికారులు ప్రస్తావించారని, వర్మకు, సుబ్బరాజుకు మధ్య జరిగిన ఎస్ఎంఎస్ ల సమాచారాన్ని చూపిస్తూ, వర్మకు వ్యతిరేకంగా కొన్ని ఆధారాలను సేకరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వర్మ నిన్న సిట్ అధికారులను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశాడని సమాచారం. ఆపై తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చినప్పటికీ, సిట్ అధికారులు ఆయన్ను పిలిపించి విచారించాలని నిర్ణయించి, నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికార ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.