: హోటల్ లో నగ్నంగా హల్ చల్ చేస్తూ పోలీసులపై దాడి... అమెరికాలో ఫేమస్ మోడల్ అరెస్ట్


ఫ్లోరిడాలోని 'ఎడ్జ్ హోటల్'లో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్న ఇన్ స్టాగ్రామ్ మోడల్ బ్రిస్సా డొమిన్గ్వెజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన గదిలో నుంచి నగ్నంగా బయటకు వచ్చి, అలాగే హోటలంతా తిరుగుతూ, ఓ టవల్ ఇవ్వబోయిన పోలీసు అధికారిని కొట్టడంతో పాటు, అదుపు చేసేందుకు చూసిన పోలీసులపై దాడి చేసినందుకు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె చేస్తున్న నిర్వాకాన్ని హోటల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, బ్రిస్సాను బయటకు పంపేందుకు సహకరించాలని కోరాడు.

పోలీసులు వచ్చి, శరీరాన్ని కప్పుకోవాలని కోరినా ఆమె వినలేదు సరికదా మరింత రెచ్చిపోయింది. దీంతో ఆమెను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆపై 10 వేల డాలర్ల బాండును తీసుకుని బెయిల్ పై విడిచిపెట్టారు. అరెస్ట్ చేసిన సమయంలో బ్రిస్సా పూటుగా మద్యం తాగి ఉందని పోలీసులు పేర్కొన్నారు. కాగా, బ్రిస్సా, తన హాట్ హాట్ సెల్ఫీలు, మోడలింగ్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పెడుతూ పాప్యులర్ అయింది. ఆమెకు 74 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

  • Loading...

More Telugu News