: భారత ఆయుధాల్లో జర్మనీ పేరిట నకిలీలు చొప్పిస్తున్న చైనా... సీబీఐ దర్యాఫ్తుతో వెలుగులోకి భారీ కుట్ర!


భారత సైనికులు వాడుతున్న ఆయుధాల్లో నకిలీలను చొప్పించేందుకు చైనా భారీ కుట్రకు పాల్పడుతోందని సీబీఐ దర్యాఫ్తులో తేలింది. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, 'మేడిన్ జర్మనీ' పేరిట చైనా ఆయుధ విడిభాగాలు వస్తున్నాయని గుర్తించింది. ఢిల్లీకి చెందిన ఆయుధ విడిభాగాల సంస్థ సింధ్ సేల్స్ సిండికేట్, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ (జీసీఎఫ్) లోని కొందరు అధికారులు ఈ మొత్తం కుట్రలో భాగస్వాములని పేర్కొంది.

మధ్యప్రదేశ్ లోని జీసీఎఫ్ లో బోఫోర్స్ శ్రేణి క్షిపణులకు అవసరమైన వైర్ రేస్ రోలర్ బేరింగ్ లు నకిలీవి సరఫరా అవుతున్నాయని గుర్తించిన సీబీఐ, జీసీఎఫ్ అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. చైనా కంపెనీలు కొన్ని సింధ్ సేల్స్ సిండికేట్ తో కుదుర్చుకున్న డీల్ లో భాగంగా జర్మనీ సంస్థ పేరిట లెటర్ హెడ్స్ తయారు చేసి, ఈ రోలర్స్ జర్మనీలో తయారైనట్టు చూపుతున్నారని, ఫోర్జరీ పత్రాల సాయంతో ఏ మాత్రం నాణ్యతలేని విడిభాగాలను ఆయుధాల్లో వాడుతున్నారని ఆరోపించింది.

  • Loading...

More Telugu News