: జియో ఫ్రీ ఫోన్ పుణ్యం.. 2జీ నుంచి 4జీకి వేగంగా మారనున్న ఇండియా!


రిలయన్స్ జియో నుంచి వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్న 4జీ ఫీచర్‌ ఫోన్ దేశాన్ని అత్యంత వేగంగా 4జీవైపు నడిపిస్తుందని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. జియో ఫోన్ అందుబాటులోకి వచ్చిన మరుక్షణం నుంచి 2జీ వినియోగదారులు మొత్తం 4జీ వైపు మళ్లుతారని చెబుతున్నారు. అలాగే ఆ ఫోన్ మార్కెట్లోకి రాగానే భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలు వినియోగదారుల మార్కెట్ షేర్‌ను గణనీయంగా కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 ఫలితంగా ఆ షేర్ మొత్తం ముకేశ్ అంబానీ సారథ్యంలోని జియోకు వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని 2 టయర్, 3 టయర్ నగరాల్లోని వినియోగదారులు జియో ఫ్రీ ఫోన్‌వైపు ఆకర్షితులవుతారని పేర్కొంటున్నారు. జియో ఫీచర్ ఫోన్ కోసం వినియోగదారులు తొలుత సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. 36 నెలల తర్వాత ఆ సొమ్మును కంపెనీ తిరిగి వినియోగదారులకు ఇచ్చేస్తుంది.

  • Loading...

More Telugu News