: అకున్ సబర్వాల్‌కి బెదిరింపుల నేపథ్యంలో రంగంలోకి దిగిన డీజీపీ అనురాగ్ శర్మ
హైదరాబాద్‌లో అలజడి రేపుతున్న డ్రగ్స్ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతూ దూసుకుపోతున్న అకున్ సబర్వాల్‌కి బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ విషయంపై ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తాజాగా తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. ఆ కాల్స్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని, కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని అన్నారు. అవసరమైతే అకున్ సబర్వాల్‌కు భద్రత పెంచుతామని తెలిపారు. ఆయనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై విచారణ ముమ్మరం చేశామని అన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలే ఈ ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది.