: నెలలో 15 రోజులు గోవాలో ఎందుకు ఉంటావ్?: హీరో తరుణ్ పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం
డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖుల విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. యువ నటుడు తరుణ్ ను సిట్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా తరుణ్ పై వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తరుణ్ ను సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని ఇవి...
- కెల్విన్ డ్రగ్స్ సప్లయర్స్ కాల్ లిస్ట్ లో నీ పేరు ఎందుకుంది?
- పబ్ ను ఎంత కాలం నడిపావు?
- ఏఏ ఈవెంట్లను నిర్వహించావు?
- ఏ ఈవెంట్ ఆర్గనైజర్లు డ్రగ్స్ సప్లై చేశారు?
- నెలలో 15 రోజులు గోవాలో ఎందుకు ఉంటావు?
- గోవాలో నీకు డ్రగ్స్ ఎవరిస్తారు?
- గోవా బీచ్ హౌస్ లో డగ్స్ వాడుతున్నావా?
- సినిమాలు చేయడం మానేసి, డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించావా?
- హైదరాబాదులోని ఇతర పబ్ ఓనర్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి?
- పబ్ లలో డ్రగ్స్ దొరుకుతున్నాయన్న ప్రశ్నకు నీ సమాధానం ఏమిటి?