: చేనును కంచె మేసినట్లు.. డ్రగ్స్‌ వ్యవహారంలో పోలీసులు తలదూర్చారు: ఏపీ డీజీపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు


క‌ల‌క‌లం రేపుతున్న డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు స్పందించి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఆయ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో పోలీసు అధికారుల పాత్ర కూడా ఉందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చేనును కంచె మేసినట్లు ప్రలోభాలకు లొంగిపోయి పలువురు పోలీసులు డ్రగ్స్‌ వ్యవహారంలో తలదూర్చారని ఆయ‌న అన్నారు. పరిధిని దాటి డ్రగ్స్‌ వ్యవహారం వెళుతోందని పేర్కొన్నారు.

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో గ‌తంలోనూ విచార‌ణ‌లు జ‌రిగాయ‌ని, ఏపీలో డ్రగ్స్‌ కేసులో ఉన్న పోలీసులను సస్పెండ్ చేశార‌ని సాంబ‌శివ‌రావు అన్నారు. తాము ఎక్సైజ్‌ శాఖతో కలిసి డ్ర‌గ్స్‌ నివారణకు ఓ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News