: భయంతో సినిమావాళ్లు హైదరాబాదును వదిలేస్తామంటే.. మేము అడ్డుకోం: మంత్రి పద్మారావు


డ్రగ్స్ కేసులో పెద్దలను వదిలేశారని వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ఎక్సైజ్ మంత్రి పద్మారావు స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన చెప్పారు. కేసులో ఎంత పెద్ద వారు ఉన్నా వదిలిపెట్టబోమని... చివరకు తన పిల్లలు డ్రగ్స్ కేసులో ఉన్నా వదిలిపెట్టబోమని అన్నారు. నేతల పిల్లలు, ఐఏఎస్ ల పిల్లలు ఉన్నా వదలమని చెప్పారు. డ్రగ్స్ కేసులకు భయపడి సినిమావారు హైదరాబాదును వదిలేస్తామంటే... అది వారి ఇష్టమని, వారిని అడ్డుకోబోమని అన్నారు. పబ్స్ లో డ్రగ్స్ అమ్మితే, వాటి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే తనిఖీలకు తానే స్వయంగా వెళతానని చెప్పారు. డ్రగ్స్ కేసుకు సంబంధించిన సమాచారం తనకు తెలియదని చెప్పడం కూడా అవాస్తవమని అన్నారు. 

  • Loading...

More Telugu News