: బిగ్‌బాస్ సెట్‌లో పుట్టినరోజు జరుపుకున్న జూనియర్ ఎన్టీఆర్ తనయుడు
జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ముందుకు దూసుకెళ్తున్న బిగ్‌బాస్ తెలుగు సెట్స్‌కి అనుకోని అతిథిని ఎన్టీఆర్ తీసుకొచ్చాడు. తన కుమారుడు అభయ్ రామ్ మూడో పుట్టినరోజును ఎన్టీఆర్ బిగ్‌బాస్ సెట్లో సెలబ్రేట్ చేశాడు. ఈ విషయాన్ని తను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. `హ్యాపీ బర్త్‌డే టూ మై హ్యాపీనెస్. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ వరాలే. అందరికీ కృతజ్ఞతలు` అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. దీంతో బిగ్‌బాస్ సెట్‌లో తన తనయుడితో పాటు వెళ్తున్న ఫొటోను ఎన్టీఆర్ షేర్ చేశాడు. 2014 జూలై 22న ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిలకు అభయ్ రామ్ జన్మించాడు.