: ఐఫా నిర్వాహకులకు నోటీసులు పంపిన సీబీఎఫ్‌సీ చైర్మన్
అవార్డుల వేడుకలో తన చిత్రాన్ని ఉపయోగించి ఇబ్బందికర హాస్యాన్ని సృష్టించినందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్ పహ్లాజ్ నిహలాని, ఇంటర్నేషనల్ ఇండియన్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా) నిర్వహకులైన విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ వారికి లీగల్ నోటీసులు పంపించారు. న్యూయార్క్ నగరంలో జూలై 15న జరిగిన ఈ వేడుకల్లో వ్యాఖ్యాతలు రితేశ్ దేశ్‌ముఖ్, మనీష్‌పాల్‌లు ఓ స్కిట్‌లో భాగంగా నిహలాని ఫొటో వాడారు.
ఇందులో ఆయనను `వాచ్‌మన్`గా చూపించడంపై నిహలాని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనని అగౌరవ పరిచినందుకు మీడియా సాక్షిగా తనకు క్షమాపణలు తెలియజేయాలని నిహలాని లాయర్ నోటీస్ ద్వారా డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో తనని అగౌరవ పరచాలనుకుంటున్న వారికి ఈ రూపంలో గుణపాఠం నేర్పేందుకు పహ్లాజ్ నిహలాని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తనను వ్యక్తిగతంగా అగౌరవ పరిచినా ఫరవాలేదు గానీ, పదవి పరంగా అవమానిస్తే చూస్తూ ఊరుకోనని నిహాలని పేర్కొన్నారు.