: అకున్ సబర్వాల్ పై మళ్లీ నోరు పారేసుకున్న రాంగోపాల్ వర్మ


వివాదాస్పద కామెంట్లు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పై మరోసారి రెచ్చిపోయాడు. అకున్ సబర్వాల్ ను బాహుబలిలో అమరేంద్ర బాహుబలిలా మీడియా భావిస్తోందంటూ సోషల్ మీడియాలో మండిపడ్డ రాంగోపాల్ వర్మ... అకున్ సబర్వాల్ కు మానవత్వం లేదని విమర్శించాడు. సిట్ దర్యాప్తు తీరును స్వయంగా అకున్ సబర్వాల్ ఎందుకు వెల్లడించడం లేదు? మీడియాకు లీకులెలా అందుతున్నాయి? మీడియాకు లీకులు అందకుండా చూడాల్సిన బాధ్యత ఆయనకు లేదా? మీడియా కథనాలతో సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

మీడియా కథనాలకు తక్షణం ఫుల్ స్టాప్ పెట్టాలని వర్మ సూచించాడు. ఏ ఆధారాలు లేకుండా సినిమా వాళ్లను ఎలా అనుమానిస్తున్నారని ఆయన ప్రశ్నించాడు. ప్రజల మనసులు చెడిపోకముందే ఆయన స్పందించాలని సూచించాడు. వర్మపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కందకు లేని బాధ కత్తికెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. నిందితులు, విచారణ ఎదుర్కొంటున్నవారు మౌనంగా ఉన్నప్పుడు నీకు వచ్చిన సమస్య ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

  • Loading...

More Telugu News