: హ‌ర్మ‌న్‌ప్రీత్ ఉద్యోగం కోసం స‌చిన్ రిక‌మెండేష‌న్‌?


ఐసీసీ మ‌హిళా ప్ర‌పంచ‌క‌ప్‌లో ప‌రుగుల వ‌ర్షం కురిపించిన హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌కు ప‌శ్చిమ రైల్వేలో మంచి స్థాయి ఉద్యోగం రావ‌డానికి ప‌రోక్షంగా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ స‌హాయం చేశార‌ని ప‌శ్చిమ రైల్వేలో స్పోర్ట్స్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసిన ఎడుల్జీ తెలిపారు. హ‌ర్మ‌న్‌ప్రీత్‌లో ఉన్న‌ టాలెంట్‌ను గుర్తించి, ఆమెను ముంబై జట్టులో చేరాల‌ని ప్రోత్స‌హించిన ఎడుల్జీ ఆ స‌మ‌యంలో ప‌శ్చిమ రైల్వేలో ప‌నిచేస్తున్నారు. అదే స‌మ‌యంలో హ‌ర్మ‌న్‌ప్రీత్‌కి కూడా ఉత్త‌ర రైల్వేలో ఉద్యోగం వ‌చ్చింది. అంత‌కంటే మంచి ఉద్యోగాన్ని ప‌శ్చిమ రైల్వేలోనే ఇప్పిస్తాన‌ని, ముంబైలోనే ఉండి ఆట మీద దృష్టి సారించాల‌ని హ‌ర్మ‌న్‌ను కోరిన‌ట్లు ఎడుల్జీ వివ‌రించారు.

ప‌శ్చిమ రైల్వేలో ఉద్యోగం కోసం హ‌ర్మ‌న్ ద‌ర‌ఖాస్తును ఢిల్లీకి పంపిస్తే రాష్ట్ర‌ప‌తి తిర‌స్క‌రించార‌ని, ఈ విష‌యంపై ఆ స‌మ‌యంలో ఎంపీగా ఉన్న స‌చిన్ టెండూల్క‌ర్ స‌హాయాన్ని కోరితే, ఆయ‌న వెంట‌నే స్పందించి హ‌ర్మ‌న్‌కు ఉద్యోగం ఇవ్వాల‌ని కోరుతూ రాష్ట్ర‌ప‌తికి లేఖ రాశార‌ని ఎడుల్జీ చెప్పారు. పురుషుల క్రికెట్‌లో ఉండే సౌక‌ర్యాల‌తో పోలిస్తే మ‌హిళ క్రికెట‌ర్‌గా నిల‌దొక్కుకోవాలంటే చాలా క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తుంద‌ని, ఈ మ‌ధ్య కాలంలో ఆ ప‌రిస్థితిలో కొంత మార్పు క‌నిపిస్తుండ‌టం గ‌ర్హించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని ఎడుల్జీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News