: ఉత్తర కొరియాలో అమెరికన్లు ఉండటానికి వీల్లేదు: అమెరికా
ఉత్తర కొరియాలో అమెరికన్లకు రక్షణ లేదని, అక్కడ నివసిస్తున్న ప్రవాస అమెరికన్లంతా వెంటనే తిరిగి వచ్చేయాలని ఉత్తర కొరియాలోని అమెరికా దౌత్య కేంద్రం ప్రకటించింది. అమెరికా దౌత్యాధికారి రే టెల్లార్సన్ పేరు మీద విడుదలైన ఈ ప్రకటనలో, భవిష్యత్తులో కూడా అమెరికన్లు ఉత్తర కొరియా వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అక్కడ ఇటీవల ఓటో వాంబియార్ అనే అమెరికన్ పౌరుడి మరణం తనను కలచివేసిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రే టెల్లార్సన్ ప్రకటనలో పేర్కొన్నారు.
జూలై 27 నుంచి సరిగ్గా 30 రోజుల్లోగా ఉత్తర కొరియాలో ఉండే అమెరికన్లంతా స్వదేశానికి రావాలని, లేకపోతే వారి పాస్‌పోర్టులను పునరుద్ధరించేది లేదని రే స్పష్టం చేశారు. అలాగే జూలై 27 తర్వాత ఉత్తర కొరియా వెళ్లే అమెరికన్ల రక్షణతో తమకు సంబంధం లేదని రే ప్రకటనలో వివరించారు. దీనిపై ఉత్తర కొరియా విదేశాంగ శాఖ స్పందిస్తూ, అమెరికాతో దౌత్య సంబంధాలను కొనసాగించే యోచనలో తాము లేమని, జూలై 27 కంటే ముందు కూడా వెళ్లిపోవాలనుకునే వారు వెళ్లిపోవచ్చని, ఇలాంటి ప్రకటనలకు బెదిరేదిలేదని తెలిపింది.