: డాన్స్ చేస్తూ కెమెరాను చూసి సిగ్గుపడిపోయిన మిథాలీ రాజ్.. వీడియో మీరు కూడా చూడండి


మహిళా క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్ కు అడుగుదూరంలో ఉన్న భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సిగ్గు పడిపోయిన ఘటన సెమీ ఫైనల్ మ్యాచ్ లో చోటుచేసుకుంది. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ సమయానికి హర్మన్ ప్రీత్ కౌర్ ఇంకా జూలు విదిల్చలేదు. అయితే అడపాదడపా షాట్లు కొడుతూ సెంచరీ పూర్తి చేసింది. సెంచరీ పూర్తి చేసిందన్న ఆనందంలో అప్పటికే అవుటైన మిథాలీ రాజ్ తన సహ క్రీడాకారిణితో కలిసి బౌండరీ లైన్ బయట కూర్చుని రెండు స్టెప్పులేసింది. ఆ సమయంలో కెమెరా వారిని గమనించడం మిథాలీ రాజ్ గమనించలేదు. అలా రెండు స్టెప్పులేస్తూ స్క్రీన్ చూసి సిగ్గుపడిపోయింది. ఆ వీడియోను ఐసీసీ తన అఫీషియల్ పేజ్ లో పోస్టు చేసింది. కాగా, మిథాలీ రాజ్ మంచి డాన్సర్ అని సహచరులు పేర్కొంటారు. 

  • Loading...

More Telugu News