: అకున్ సబర్వాల్ ను మీడియా అమరేంద్ర బాహుబలిని చేస్తోంది: రాంగోపాల్ వర్మ సెటైర్లు


డ్రగ్స్ పై సిట్ దర్యాప్తు గురించి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో స్పందించాడు. స్కూలు పిల్లలు కూడా డ్రగ్స్ వాడుతున్నారని తెలిసి, తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు. తెలుగు మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డాడు. డ్రగ్స్ పై దర్యాప్తు చేస్తున్న అకున్ సబర్వాల్ ను తెలుగు మీడియా 'బాహుబలి'లోని 'అమరేంద్ర బాహుబలి' లెవెల్ లో పొగిడేస్తోందని అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై రాజమౌళి 'బాహుబలి 3' సినిమా తియ్యాలేమో అని ఎద్దేవా చేశాడు. డ్రగ్స్ లో వినియోగంలో చాలా మంది ఉన్నారని, అయితే సినీ పరిశ్రమను మాత్రమే మీడియా ఫోకస్ చేస్తోందని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

  • Loading...

More Telugu News