: 'బిగ్‌ బాస్‌' షో హైందవ సంస్కృతిని కించపరిచేలా ఉంది... బ్యాన్ చేయాలి: బ్రాహ్మణ సంఘాలు


స్టార్ మాటీవీలో ప్రతి రోజూ రాత్రి 9:30 నుంచి గంటపాటు ప్రసారమయ్యే 'బిగ్ బాస్' షోకు ఆదరణ పెరుగుతోంది. ఇంకా ప్రారంభదశలోనే ఉన్న ఈ షోపై అప్పుడే వివాదం మొదలైంది. షోలో సిగిరెట్లు ఇవ్వడం లేదని పార్టిసిపెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... ఈ రియాలిటీ షోలో హైందవ సంస్కృతిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

హోమగుండం వద్ద బ్రష్‌ చేసుకుంటూ చలి మంటలు కాచుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయని, అందులో ఆజ్యం పోస్తుండటం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని సవరించి, క్షమాపణ చెప్పాలని జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ సేవాసమితి డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News