: 14 మంది డ్రగ్ నిందితుల బ్యాంక్ అకౌంట్లు స్తంభింపజేసిన సిట్?
హైదరాబాదులో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులైన 14 మంది డ్రగ్ నిందితుల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని సిట్ బ్యాంకులకు లేఖ రాయనుంది. బిట్ కాయిన్స్ ఎక్స్ ఛేంజ్ అకౌంట్స్ ను కూడా ఫ్రీజ్ చేయించాలని ఏసీబీని సిట్ కోరింది. డ్రగ్స్ సరఫరా చేసేవారి బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని చెబుతూ నార్కోటిక్ బ్యూరో విదేశీ బ్యాంకులకు లేఖలు రాసింది. వారి అకౌంట్స్ నిలిపివేయడం ద్వారా వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొడితే వారే దారికి వస్తారని సిట్ భావిస్తోంది. దీంతో ఆ 14 మంది డ్రగ్ డీలర్ల అకౌంట్లు నిలిపేయాలని సిట్ కోరుతోంది.