: సుబ్బరాజుకు బీపీ డౌన్ ఎందుకైంది? ఎందుకేడ్చాడు?... అకున్ సబర్వాల్ ఏం చేశారు?


టాలీవుడ్ ను పట్టికుదిపేస్తున్న డ్రగ్స్ స్కాండల్ ను తుడిచిపెట్టేందుకు నిర్ణయించిన సిట్ ముందు నిన్న విచారణకు హాజరైన సినీ నటుడు సుబ్బరాజుకు బీపీ డౌన్ అయిన సంగతి తెలిసిందే. సుబ్బరాజుకు బీపీ డౌన్ ఎందుకైంది? అన్న విషయాలు వెలుగుచూశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిట్ అధికారులకు ఏమాత్రం సహకరించని సుబ్బరాజు....అకున్ సబర్వాల్ విచారణలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత కూడా అదే వైఖరి ప్రదర్శించాడు. దీంతో సాయంత్రం ఐదు గంటల తరువాత అధికారులు ఆయనకు కొన్ని వీడియోలు చూపించారు. దీంతో అంత వరకు ఎంతో గంభీరంగా ఉంటూ మనసువిప్పి మాట్లాడేందుకు ఏమాత్రం సహకరించని సుబ్బరాజు... ఆందోళనలో పడిపోయాడు. వాటిని చూస్తూ భోరుమన్నాడట.

అనంతరం సిట్ అధికారులు శీలం శ్రీనివాసరావు, జి.శ్రీనివాస్ తో పాటు, ఏఈఎస్‌ పవన్‌ కుమార్‌ తమ ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు. మీకు డ్రగ్స్‌ అలవాటు ఉందా? పూరి జగన్నాథ్‌ తో మీకున్న డ్రగ్స్‌ సంబంధం ఏంటి? మీకు కెల్విన్‌ తెలుసా? సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడుతున్న వారు ఎవరెవరు? వారికి ఎవరు, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు? అంటూ ప్రశ్నల పరంపర సంధించారు. సుబ్బరాజుకు చూపించిన వీడియోలో పూరీ జగన్నాథ్ డ్రగ్స్ వినియోగిస్తుండగా... తాను అతని పక్కనే కూర్చున్న సన్నివేశం చూసిన సుబ్బరాజు బుక్కైపోయానని అర్థం చేసుకుని వివరాలు వెల్లడించాడు. బ్యాంకాక్‌ వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ తెచ్చి పూరీకి ఇచ్చానని తెలిపాడు. తాను మాత్రం ఇంతవరకు డ్రగ్స్ తీసుకోలేదని అన్నాడు.

 తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో సుబ్బరాజు బీపీ ఒక్కసారిగా డౌన్‌ అయింది. దీంతో ఉస్మానియా వైద్య బృందంతో వైద్య పరీక్షలు చేయించారు. విచారణకు కొంత బ్రేక్‌ ఇచ్చి, డాక్టర్లు ఓకే అన్న తర్వాత మరోమారు ప్రశ్నించారు. దీంతో సినీ పరిశ్రమలో వేళ్లూనుకున్న డ్రగ్స్ పై సుబ్బరాజు పలు కీలక వివరాలు వెల్లడించాడు. సుదీర్ఘ కాలంగా సినీ పరిశ్రమలో ఉంటున్న కుటుంబానికి సంబంధించిన డ్రగ్స్ వినియోగం వివరాలు సుబ్బరాజు వారికి అందజేయడం విశేషం. అలాగే మరికొన్ని వివరాలను కూడా సుబ్బరాజు సిట్ అధికారులకు తెలిపాడు. దీంతో సిట్ అధికారులు విచారణలో వేగం పెంచారు. 

  • Loading...

More Telugu News